
1) ఎన్ని రేట్లు పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వచ్చేవి, ఏమిటవి ? _______________________
ANS: అయిదు పైసల బిల్లలు
2) ఉన్న చోటే ఉంటుంది, వేళా పాలా చెపుతుంది. ఏమిటది ? _______________________
ANS: గోడ గడియారం
3) రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు. ఏమిటది ? _______________________
ANS: చంద్రుడు
4) విత్తనం లేకుండా మొలిచేది. ఏమిటది ? _______________________
ANS: గడ్డము
5) కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు? _______________________
ANS: ఉల్లిపాయ
6) చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? _______________________
ANS: కజ్జికాయ
7) నల్లకుక్కకు నాలుగు చెవులు _______________________
ANS: లవంగం
8) కిట కిట తలుపులు,కిటారి తలుపులు,ఎప్పుడు తీసిన చప్పుడు కావు,ఏమిటవి ? _______________________
ANS: కనురెప్పలు
9) చిక్కటి కారడవిలో చక్కని దారి _______________________
ANS: పాపిట
10) రాజావారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారే లేరు _______________________
ANS: నక్షత్రాలు